![]() |
![]() |
బ్రహ్మముడి మానస్ బుల్లితెర మీద దూసుకుపోతున్న నటుడు. బ్రహ్మముడి సీరియల్ ద్వారా మంచి గ్రాఫ్ పెంచుకుని తెలుగు ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. అలాగే కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ షోలో చేస్తున్నాడు. డాన్స్ ఐకాన్ లో కూడా చేసాడు మానస్. అలాంటి మానస్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ విషయంలో ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చాడు. "బిగ్ బాస్ లో ముందుగానే విన్నర్ ఫిక్స్ అయ్యి ఉంటాడు అంటారు అది నిజమేనా" అని హోస్ట్ అడిగింది. "మా సీజన్ లో సన్నీ విన్నర్ అయ్యాడు..తర్వాత కౌశల్, రాహుల్ సిప్లిగంజ్ విన్నర్స్ అయ్యారు. ఎవరూ విన్నర్స్ విషయంలో ముందుగా ఊహించలేకపోయాం. బిగ్ బాస్ విన్నర్ ఫిక్స్ అనే మాట ఫేక్. ఆడియన్స్ మైండ్ ని డీవియేట్ చేయడానికి వాళ్లకు విన్నర్ ఎవరు అని మాట్లాడుకోవడానికి స్కోప్ ఇవ్వడం అన్నమాట. ఇక్కడ ఫిక్స్డ్ అనేది ఉండదు. అలాగే ఇక్కడ స్క్రిప్ట్ అనేదే ఉండదు. గతంలో కూడా చాలా మంది బిగ్ బాస్ స్క్రిప్టెడ్ కాదు అని చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ ఇటీవలి కాలంలో చాలా నెగటివిటీని మూట గట్టుకుంది. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా మొదలైన బిగ్ బాస్ మొదటి రెండు సీజన్ లకు ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యారు. కానీ ఆ తర్వాత వచ్చిన సీజన్స్ మాత్రం ఆడియన్స్ ని పెద్దగా అలరించలేకపోయాయి. ఐతే బిగ్ బాస్ ని ఇంకా సరికొత్తగా మార్చి ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నారు.
![]() |
![]() |